టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

Submitted by arun on Mon, 08/13/2018 - 17:12
kcr

వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే లక్ష్యంగా కేసీఆర్‌ పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగుతోంది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు అయినా, గడువు మేరకు అయినా ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.
రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌కు ఎన్నికల సవాలు విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటలకు సమావేశం వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు వివరించనున్నారు.

English Title
trs-state-body-meeting-by-cm-kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES