టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్...ఆ 20మంది ఎవరు..?

Submitted by arun on Tue, 08/14/2018 - 10:08

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. సిట్టింగ్ లందరికీ సీట్లు గ్యారెంటీ అని చెబుతూనే సుమారు 20మంది సీట్ల మాత్రం గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆ 20 మంది ఎవరనే ఉత్కంఠ మొదలైంది. ఇంతకి డేంజర్ జోన్ ఉన్నదెవరు తిరిగి బెర్త్ దక్కించుకుంటునది ఎవరు..?

ఎన్నికలు ఎప్పుడొచ్చిన సెంచరీ కొట్టడం ఖయమంటున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. అభ్యర్ధుల వడపోత కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కోసం నియమించారు. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ సెక్రటరి జనరల్ కేకే అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. 


సెప్టెంబర్‌ 2న హైదరాబాద్ లో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ సభలో నాలుగేళ్లలో ఏం చేశామో చెబుతామని అన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తానని చెప్పారు. సిట్టింగు లందరికి సీట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే వడపోత కార్యక్రమం మొదలైందన్నారు. కార్యదర్శులు పర్యవేక్షిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యే పనితీరును పార్టీ అదినాయకత్వానికి అందచేయాలని కోరారు. 

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలతో.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను స్క్రీనింగ్ కమిటీ అప్పగించినట్టు కేసీఆర్ తెలిపారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఖాయమంటూనే ఓ 20మందికి మాత్రం టికెట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే సంకేతాలిచ్చారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ మొదలైంది. ఆ 20మంది ఎవరు అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలవర పెడుతోంది. 

రానున్న ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక రేసులో తాము ఎక్కడున్నామో తెలియక టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. తామకు ఎర్త్ పెడతారా బెర్త్ దక్క నుందా అనే ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ లోనే అభ్యర్దుల ప్రకటన ఉండనుంది కేసీఆర్ ప్రకటించడంతో తమ భవిష్యత్తు ఎలా ఉండనుందోననే ఆందోళన కొనసాగుతోంది. 

English Title
TRS Sitting MLAs in tension over KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES