ఆ రోజు అపురూపమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది : మంత్రి కేటీఆర్

ఆ రోజు అపురూపమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది : మంత్రి కేటీఆర్
x
Highlights

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంగడతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు....

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంగడతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్, సుడిగాలి పర్యటన చేశారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామన్నారు మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ 2న అపురూపమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుందన్నారు. ఇదిలావుంటే సెప్టెంబర్ 2న జరగనున్న ప్రగతి నివేదన సభకు ఇప్పటికే కమిటీలను ఏర్పాట్లు చేశారు సీఎం కేసీఆర్. శనివారంఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆయనతో చర్చించారు. అలాగే విభజన హామీలు, హైకోర్టు విభజన తదితర అంశాలు ప్రస్తావించగా ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇక ముందస్తు ఎన్నికల విషయాన్నీ సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభ ద్వారా వెల్లడించే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories