తెలంగాణలో టీఆర్ఎస్‌ దూకుడు..సర్వేలన్నీ కారుకే అనుకూలం

తెలంగాణలో టీఆర్ఎస్‌ దూకుడు..సర్వేలన్నీ కారుకే అనుకూలం
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్‌కే లోక్‌సభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్‌కే లోక్‌సభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కారులోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్టు సర్వే సంస్థలన్నీ ప్రకటించాయి. సార్వత్రిక ఎన్నికలు ముగియగా దేశమంతా మొదలైన ఎగ్జిట్‌పోల్స్‌ హడావుడిలో మొత్తం 17 సీట్లలో టీఆర్ఎస్‌ 14 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి.

ఏడంచెల ఎన్నికల సమరాంగణం ముగియీ ముగియగానే ఎగ్జిట్‌పోల్స్‌ హడావిడి దేశమంతా కనిపించింది. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రకమైన ఫలితాలను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టాయి. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్ లో కారు పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గులాబీ పార్టీకి కనీసం 14 నుంచి గరిష్ఠంగా 16 స్థానాలు రావొచ్చని సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని తెలిపాయి. ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్‌ మినహా మిగతా అన్ని సంస్థలు బీజేపీకి తెలంగాణలో ఒక స్థానం దక్కుతుందని అంచనా వేశాయి.

*ఆర్జీ ప్లాష్‌ టీమ్‌ సర్వే సంస్థ టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు, ఎంఐఎం 1 స్థానాన్ని, బీజేపీకి అసలు ఛాన్సే లేదని తేల్చి చెప్పింది.

*ఇక న్యూస్‌ 18 సంస్థ టీఆర్ఎస్‌కు 12 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్‌కు 1 నుంచి రెండు సీట్లు, ఎంఐఎంకు 1, బీజేపీకి 1 నుంచి రెండు సీట్లు రావచ్చని అంచనా వేశాయి.

*ఇక ఎన్డీటీవీ. టీఆర్ఎస్‌కు గరిష్టంగా 12, కాంగ్రెస్‌కు 2, ఎంఐఎంకు 2, బీజేపీకి ఒక సీటు రావచ్చని తెలిపింది.

ఇండియా టుడే కూడా ఇంతే. టీఆర్ఎస్‌కు 10 నుంచి 12, కాంగ్రెస్‌, ఎంఐఎంలు 1 నుంచి 3, బీజేపీకి 1 సీటటు రావచ్చని వెల్లడించింది.

*సీ ఓటర్‌ సర్వే కూడా టీఆర్ఎస్‌కు గరిష్టంగా 14, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంకు 1 సీట్లు రావచ్చని తెలిపింది.

టైమ్స్‌నౌ సంస్థ కూడా టీఆర్ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 2, బీజేపీ, ఎంఐఎంకు చెరో సీటు రావచ్చని అంచనా వేసింది.

*ఇక టుడేస్‌ చాణక్య సంస్థ కారు పార్టీకి 12 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్‌ 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు కూడా 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 1 సీటు రావచ్చని వెల్లడించాయి. మొత్తంగా ఎలా చూసినా అసెంబ్లీ ఎన్నికల్లోలాగానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కారు జోరు ఆగదన్న విషయాన్ని సర్వేలు తేల్చిచెప్పాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories