అందుకే కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు

Submitted by arun on Sat, 09/08/2018 - 16:12
Trs Leaders

టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్యనేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిప‌డ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్‌ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వారు కార్పోరేటర్‌లను బెదిరిస్తున్నారని టికేట్‌ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. కొండా సురేఖకు టికెట్‌ రాకపోవడంలో తన ప్రమేయం లేదని ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

English Title
trs leaders respond on konda surekha allegations

MORE FROM AUTHOR

RELATED ARTICLES