‘టీజీ...చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపనలు మానుకో’

Submitted by arun on Thu, 06/21/2018 - 15:46
karna

ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతివ్వకపోతే తమ సత్తా చూపుతామంటూ టీడీపీ  రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్ చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపణలు మానుకోకపోతే బుద్ధి చెప్పాల్సి వస్తుందని  ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకోవడంలో విఫలమైన  టీడీపీ నేతలు ..తమపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.  తెలంగాణ అభివృద్ధి చూసి టీజీలో అసూయ, ద్వేషం పెరగడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను చంద్రబాబు కంట్రోల్ చేయకపోతే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదముందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి పార్లమెంట్ సాక్షిగా మద్ధతు ప్రకటించినా నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతారంటూ  కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. 

English Title
trs leaders fire on tg venkatesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES