logo

అమరుల కుంటుంబానికి ఒక్క సీటు ఇవ్వలేరా : శంకరమ్మ

అమరుల కుంటుంబానికి ఒక్క సీటు ఇవ్వలేరా : శంకరమ్మ

తెలంగాణా అమరుల కుటుంబాలకు టిక్కెట్లు ఎందుకు ఇవ్వలేదు అంటూ టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు శంకరమ్మ. తెలంగాణా అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిగా తనకు టిక్కెట్ కేటాయించకుండా అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.హుజూర్ నగర్ టిక్కెట్ తనకు కేటాయించక పోతే తనకు చావు తప్ప మార్గం లేదని హెచ్చరించారు.వెయ్యిమంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణాలో అమరుల కుంటుంబానికి ఒక్క సీటు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. బీసీ అయినందుకే తనకు హుజూర్ నగర్ టికెట్‌ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకున్నారని శంకరమ్మ మండిపడింది. అయినా కూడా కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని శంకరమ్మ స్పష్టం చేసింది.

లైవ్ టీవి

Share it
Top