రాహుల్ టూర్‌కి టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్

Submitted by arun on Mon, 08/13/2018 - 14:24

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి తెలంగాణ భవన్‌లో జరగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులను ఆహ్వానించారు. అయితే రాహుల్ పర్యటన సమయంలోనే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. ఈ భేటీ తర్వాత కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి టీఆర్‌ఎస్‌ కార్యవర్గ భేటీ ఫెడ్యూల్ ప్రకారం ఇవాళ లేదు. కానీ హఠాత్తుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags
English Title
TRS To Hold state Committee Meeting Today

MORE FROM AUTHOR

RELATED ARTICLES