ముందస్తుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం...ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, రాజీవ్‌శర్మ

Submitted by arun on Thu, 08/23/2018 - 13:49

ముందస్తుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి మంత్రులతో ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజార్టీ మంత్రులు ముందస్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఇవాళ తెల్లవారుజామునే మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ ము‌ఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ముందస్తుపై చర్చించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు. దీంతో ముందుస్తుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

English Title
TRS Govt Will Ready For Pre Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES