తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

x
Highlights

తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 24 శాతానికే పరిమితం కానుంది. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే...

తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 24 శాతానికే పరిమితం కానుంది. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ నుతీసుకొచ్చి బీసీల రిజర్వేషన్లను కుదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగనున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లు, పంచాయతీ రాజ్ కట్టం ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 60.19 శాతానికి చేరనుంది. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రత్యేక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగనున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా, ఈ సారి 24 శాతానికి పరిమితం కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారు.

పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 100 శాతం ఎస్టీలున్న 1,326 గ్రామాలతోపాటు మరో 1,308 గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించనున్నారు. 2,634 ఈ గ్రామాలను మినహాయిస్తే రాష్ట్రంలో ఇక 10,117 మైదానప్రాంత పంచాయతీలుంటాయి. వీటిలో జనాభా ఆధారంగా ఎస్టీలకు 5.73 శాతం ప్రకారం 580 పంచాయతీలు, ఎస్సీలకు 20.46 శాతం ప్రకారం 2,070 పంచాయతీలు రిజర్వుచేశారు. వీటిని మినహాయించి పాత చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం 3,440 పంచాయతీలు, జనరల్ క్యాటగిరీలో 4,027 పంచాయతీలు ఖరారుచేస్తారు.

50 శాతం మహిళలకుఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 నాటికే ఎన్నికలు పూర్తి చేయాలి. 25 రోజులు కూడా గడువు లేనందున ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఎస్‌ఈసీకి రిజర్వేషన్ల నివేదికను సమర్పించిన తర్వాత కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధితో రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీరికి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories