రెడీ 1..2..

Submitted by arun on Fri, 06/29/2018 - 12:35

నిన్న కూడా టీఆర్ఎప్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ దర్శన భాగ్యం కలగలేదు. దీంతో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇదే అదనుగా డీఎస్‌ను హస్తం గూటికి చేర్చే యత్నాలు ఆరంభించింది. పరిస్థితి చూస్తుంటే డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు డీఎస్‌పై ఫిర్యాదు చేయడంతో ఆయన మొన్ననే కేసీఆర్‌ను కలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ అపాయింట్ మెంట్ రద్దయ్యిందనీ నిన్న మధ్యాహ్నానికి  మళ్ళీకేసీఆర్‌ సమయమిచ్చినట్లు స్వయంగా డీఎస్‌ చెప్పారు. కానీ నిన్న కూడా డీఎస్‌కు కేసీఆర్ దర్శనం లభించలేదు. విజయవాడ పర్యటన, కీలకమైన అపాయింట్‌మెంట్ల కారణంగా కేసీఆర్‌ను డీఎస్‌ కలిసే వీలు చిక్కలేదు.

గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను డేగ‌క‌న్నుతో పరిశీలిస్తున్న తెలంగాణ  కాంగ్రెస్ డీఎస్‌ కారు ప్ర‌యాణానికి బ్రేకులు వేసే యత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్‌లో చేరాలన్న డీఎస్ అభిప్రాయాన్ని సోనియాకు తెలియచేయడంతో పాటు వారి భేటీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులక్రితం కాంగ్రెస్ నేత దానం నాగేందర్ గులాబీ తీర్ధం పుచ్చుకోవడంతో అదే సామాజిక వ‌ర్గానికి చెందిన డీఎస్‌ను సొంత గూటికి తీసుకువ‌రావ‌డం ద్వారా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లవుతుందని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఒక‌టి రెండు రోజుల్లో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

మరోవైపు డీఎస్ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ ఎంపీ కవితపై నిప్పులు చెరిగారు. తమ కుటుంబంపై అర్థరహితంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. తాను ఎదగాలనుకుంటే 2004 లోనే రాజకీయాల్లోకి వచ్చేవాడినన్న అరవింద్..కవితలాగా తండ్రిపై, అన్నపై ఆధారపడ లేదన్నారు. మొత్తానికి డీఎస్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది.

English Title
TRS D Srinivas to Join in Congress Party

MORE FROM AUTHOR

RELATED ARTICLES