టీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కలు

x
Highlights

టీఆర్ఎస్ కు ప్రచారంలో ఎదురు దెబ్బలు తప్పటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల బాట పట్టిన అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు ఏం...

టీఆర్ఎస్ కు ప్రచారంలో ఎదురు దెబ్బలు తప్పటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల బాట పట్టిన అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని నిలదీస్తున్నారు. అడుగడుగునా నిరసనలు తెలుపుతున్నారు.

అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలపై కచ్చితమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం కుటీగల్ గ్రామంతోపాటు నూతన గ్రామ పంచాయతీ రెడ్యా తండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తండావాసులు జలక్ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూములు పట్టాలు, నీటి సమస్య, కల్యాణ లక్ష్మీలపై గిరిజనులు నిరసన తెలిపారు. ముత్తిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామంలో టీఆర్ ఎస్ అభ్యర్థి రాజయ్య ప్రచారం చేయాల్సి ఉంది. మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మార్చి వస్తే గాని మా ఊర్లోకి రానివ్వమంటూ తేల్చి చెప్పారు. దీంతో గ్రామంలో ప్రచారం జరగలేదు. ఎన్నికలవేళ కామారెడ్డి జిల్లా జుక్కల్ టీఆర్ ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారంలో రజక మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. హన్మంత్ షిండేను టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రజకుల నుంచి వ్యతిరేకత రావడంతో హన్మంత్ షిండే దిగి వచ్చారు. రజకులకు క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి రజకుల మనోభావాలను కించపరిచిన తీరు నలుగురికి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తూ తరలిస్తున్న బతుకమ్మ చీరలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీని అడ్డుకున్నారు అనంతరం టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రచారం ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఒకవైపు... వెళితే ప్రజల నుంచి నిరసనలు మరోవైపు అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories