కాయిన్స్ మింగటం లేదు..

కాయిన్స్ మింగటం లేదు..
x
Highlights

అయ్యా.. బాబో.. అన్నం బదులు డబ్బులు మింగుతున్నాడేంటి. కాయిన్స్ తో అనుకుంటున్నాడా లేక కొబ్బరి ఉండలు అనుకుంటున్నాడా.. అలా గుటుక్కున్న మింగుతున్నాడు....

అయ్యా.. బాబో.. అన్నం బదులు డబ్బులు మింగుతున్నాడేంటి. కాయిన్స్ తో అనుకుంటున్నాడా లేక కొబ్బరి ఉండలు అనుకుంటున్నాడా.. అలా గుటుక్కున్న మింగుతున్నాడు. అన్నం తినే అలవాటు లేదనుకుంటా.. అందుకే అలా కాయిన్స్ మింగితే.. తిరగేసి ఒక్కటిచ్చి మొత్తం కక్కిస్తున్నట్టున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది కదూ. అక్కడే నాతో పాటు మీరు పర్సులో కాలేశారు. అతను మనిషి కాదు.. మనీ పర్సు. అచ్చంగా మనిషి నోరులా కనిపిస్తున్న ఈ పర్సుని జపాన్‌కి చెందిన మ్యూజిక్ కంపోజర్, ఆర్టిస్ట్ డూ డిజైన్ చేశారు. ఈ పర్సుని తెరవాలంటే దాని నోరు తెరవాల్సిందే.

దీన్ని తయారు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్స్ .. వావ్.. వాటే క్రియేటివిటీ అంటూ మెచ్చుకుంటున్నారు. ఎలా తయారు చేశారో మాకు కొంచెం చెప్పండంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఆ ఒక్కటీ మాత్రం అడక్కండి అంటూన్నారు డూ. పోనీ రేటైనా చెప్పండి.. ఎంతైనా కొంటాం అని అడిగేవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతానికైతే తానేమి దీన్ని మార్కెట్ చేయాలనుకోవట్లేదని అంటున్నారు. మరి డిమాండ్ పెరిగితే డూ ఆలోచన మారుతుందేమో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories