పెళ్ళి వార్త‌లపై స్పందించిన త్రిష‌

Submitted by arun on Wed, 05/30/2018 - 13:37
trisha

టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మళయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మన్ తో త్రిషకు ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. అతడ్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించు కుందని ఇందుకోసమే భారీ స్థాయిలో షాపింగ్ చేస్తోందని కూడా ప్రచారం జరిగింది. దీనిపై త్రిష తాజాగా స్పందించింది. కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. పెళ్లి ఆలోచ‌న నా మ‌న‌సులో ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. నా మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తి నాకు తార‌స ప‌డితే కచ్చితంగా ప్రేమ వివాహ‌మే చేసుకుంటాను. దీని గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా ఇస్తానంటూ త్రిష వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ సినిమాల‌తో బిజీగా ఉంది త్రిష‌.

English Title
trisha gives clarity on her marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES