'మేడే' రోజున సెలవెందుకు?

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:18
Biplab Deb

వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సంచలనంగా నిలిచాడు త్రిపుర సిఎం విప్లవ్ దేవ్. ప్రపంచకార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా 'మేడే1' నిర్వహించుకుంటాం. అయితే మేడే దినోత్సవం సందర్భంగా ప్రపంచదేశాలు, కార్మికులకు, ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటిస్తారు, కాగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విప్లవ్ మాట్లాడుతూ మేడే రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు, మీరేమీ కార్మికులు కాదు, కార్మాగాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కూలీలకు మాత్రమే ఈ మేడే సెలవు దినం వర్తిస్తుందన్నారు. ఈఏడాది నుండి సర్కార్ ఉద్యోగులకు మేడే రోజు సెలవు ఉండదని స్ఫష్టం చేశారు. గత వారం త్రిపుర సర్కార్ సెలవుల పట్టికలో మేడేను పని దినంగా ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా సిఎం విప్లవ్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.

English Title
tripura cm say why employes are needed holiday on may day

MORE FROM AUTHOR

RELATED ARTICLES