సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్‌!

సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్‌!
x
Highlights

ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. 2005 నాటి ఆదాయానికి...

ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. 2005 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుకు చిక్కులు తప్పేలా లేవు. 2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై బాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో స్టేలను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయింది.

ఇక దీంతో హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టింది. ఈ కేసు విచారణ కొనసాగింపుకు తన అభిప్రాయం చెప్పాలని పిటిషనర్ అయిన లక్ష్మీపార్వతిని కోరింది. దీంతో ఆమె శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. త్వరలో ఈ కేసు విచారణ ప్రారంభించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేనెల 13న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories