రేపే ఇంజిన్‌లెస్ ట్రైన్ 18 ట్రయల్ రన్

Submitted by chandram on Fri, 11/16/2018 - 15:14
train

భారతీయ రైల్వే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"కు  రేపు పెద్దఎత్తున అధికారులు ట్రయల్  రన్ నిర్వహిస్తున్నారు. మొదటగా బరేలీ నుండి మొరాదాబాద్ రైల్వే లైన్లో  ట్రైన్ 18ను ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ట్రయిల్ రన్ కోసం ఆర్‌డీఎస్‌ఓ సిబ్బంది మొరాదాబాద్ కు చేరారు. కాగా ఈ రైలు రూ. 100 కోట్లతో రూపొందించారు. ఇది గంటకు 160 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ట్రైన్ 18 ప్రారంభమైతే దీన్ని శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో నడిపాలని భావిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. ఇలాంటివే మరో ఆరు ట్రైన్ 18లను ఐసీఎఫ్ తయారు చేయనుందని అధికారులు తెలిపారు.
 

English Title
train 18 indian frist engine less train trail run

MORE FROM AUTHOR

RELATED ARTICLES