లక్డీకపూల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్

x
Highlights

హైదరాబాద్ లక్డీకపూల్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడు. ఆర్టీసీ బస్సు ఎక్కిన కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోమని కండెక్టర్ కోరగా నన్నే టికెట్...

హైదరాబాద్ లక్డీకపూల్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడు. ఆర్టీసీ బస్సు ఎక్కిన కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోమని కండెక్టర్ కోరగా నన్నే టికెట్ అడుగుతావా అంటూ ఎదురుదాడికి దిగాడు. టికెట్టు తీసుకోకుంటే కిందకి దిగిపోమని కండెక్టర్ అనడంతో అసభ్య పదజాలంతో నోటికి వచ్చినట్లు దూషించాడు. పోలీస్ స్టేషన్ లో పడేసి చితక్కొడతా అంటూ బెదిరించాడు దీంతో తోటి ప్రయాణికులు కానిస్టేబుల్ ను నిలదీయడంతో చేసేదేమీ లేక అసెంబ్లీ బస్టాప్ వద్ద దిగిపోయాడు. ఈ వ్యవహారాన్ని ఒకరు వీడియో తీయడంతో అదికాస్త ఇప్పుడు వైరెల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories