కాసేపట్లో ఐటీ ముందుకు రేవంత్‌ రెడ్డి ..

కాసేపట్లో ఐటీ ముందుకు రేవంత్‌ రెడ్డి ..
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఆదాయపు పన్ను శాఖ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఆదాయపు పన్ను శాఖ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకాబోతున్నారు. రేవంత్‌తో పాటు గతంలో విచారణను ఎదుర్కొన్న వారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

గత నెల 29 న ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, నగదు గురించి ఇవాళ రేవంత్‌ను ఐటీ అధికారులుమరోసారి విచారిస్తారు. బషీర్ బాగ్ లోని ఐటీ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇల్లు, ఆయన బంధువుల ఇళ్ళలో స్వాదీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్ల గురించి ప్రశ్నిస్తారు. అలాగే రేవంత్ రెడ్డికి బినామీ ఆస్తులు, బినామీ కంపెనీలు ఉన్నాయన్న ఫిర్యాదుపైనా ఐటీ అధికారులు విచారణ చేస్తారు. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షలు రూపాయలు ఎక్కడ నుండి సమకూర్చారు. 50 లక్షలకి సంబంధించి పన్ను కట్టరా లేదా అనే అంశాలపై వివరాలు సేకరిస్తారు.

రేవంత్, ఆయన బంధువుల ఇళ్ళల్లో సోదాలు జరిగాక ఇప్పటికే ఒక విడత విచారణ ముగిసింది. ఈ నెల మూడో తేదీన దాదాపు 4 గంటల పాటు రేవంత్‌రెడ్డిపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయసింహను ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీన మరోసారి విచారణకు రావాలని అప్పుడే రేవంత్‌రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఇవాల్టి విచారణకు రేవంత్ అనుచరుడు ఉదయసింహ, రేవంత్ మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్య కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి సైతం హాజరయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories