ట‌చ్ చేసి చూడు ప్ల‌స్ లు, మైన‌స్ లు

ట‌చ్ చేసి చూడు ప్ల‌స్ లు, మైన‌స్ లు
x
Highlights

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ...

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. రాజా ది గ్రేట్ త‌రువాత వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో బిజీగా మారిన మాస్ మ‌హ‌రాజా ట‌చ్ చేసి చూడు ప్ర‌మోష‌న్ కాస్త పేల‌వంగా మారిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌స్టాప్ అంతా ఫ్లాట్ నేర‌ష‌న్ తో న‌డిచిన ఇంట‌ర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింద‌ని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచాలు పెరుగుతాయి. కానీ సెకెండ్ ఆఫ్ లో కొత్త‌సీసాలో పాత సారా అన్న చందంగా సినిమా ఉండ‌డం ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాల్సి ఉంది. అయితే డైర‌క్ట‌ర్ దీన్ని చాలా తెలివిగా డీల్ చేశాడు. సెకెండ్ ఆఫ్ లో కొన్ని యాక్ష‌న్ సీన్స్ పెట్టి మ‌మా అనిపించాడు. క‌థా ఆసాంతం ఫ్లాట్ గా ఉండ‌డం 147 నిమిషాల ర‌న్ టైం కూడా సినిమాలో చాలా సీన్ల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.

సినిమాలో ప్ల‌స్ లు మైన‌స్ ల విష‌యానికొస్తే ప్ర‌తీసినిమాలో చెప్పుకునే ర‌వితేజ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్ల‌తో రొమాంటిక్ సీన్లు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఫ‌ర్వాలేద‌ని పిస్తోంది.
సినిమా స్టోరీ బ‌ల‌హీన‌మైన స్టోరీ , ఫ‌స్టాఫ్ అంతా ఫ్లాట్ గా న‌డ‌వ‌డం , ఎడిటింగ్ లో లోపాలు స్పష్టంగా క‌నిపిస్తాయి. సినిమా ఈ త‌ర‌హాలో ఉండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా వెన‌క‌బ‌డిపోతుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

Show Full Article
Print Article
Next Story
More Stories