కక్కుర్తి ఖాకీలు.. చలివేంద్రంలో గ్లాసు ఎత్తుకెళ్ళారు

కక్కుర్తి ఖాకీలు.. చలివేంద్రంలో గ్లాసు ఎత్తుకెళ్ళారు
x
Highlights

కంచే చేను మేస్తే. ఇదిగో సరిగ్గా ఇలానే ఉంటుంది. కక్కుర్తి కి కుడా ఓ హద్దుంటుంది. కానీ, ఈ పోలీసుల కక్కుర్తికి ఏం పేరు పెట్టాలో కూడా అధికారులకు అర్థం...

కంచే చేను మేస్తే. ఇదిగో సరిగ్గా ఇలానే ఉంటుంది. కక్కుర్తి కి కుడా ఓ హద్దుంటుంది. కానీ, ఈ పోలీసుల కక్కుర్తికి ఏం పేరు పెట్టాలో కూడా అధికారులకు అర్థం కాక బదిలీ వారిని చేశారు.

వివరాల్లోకి వెళితే..

దొంగలను పట్టుకోవడం అనేది పోలీసుల బాధ్యత.. కానీ పోలీసులే దొంగతనం చేస్తే ఇక రక్షణ అన్న మాటకు విలువెక్కడుంది.. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి అక్కడక్కడ కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.. ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం.. స్వాంతన కలిగించడం కోసం ఏర్పాటు చేసిన వాటికి కూడా రక్షణ లేకుండా పోయింది.. మొన్నామధ్య ఇద్దరు వ్యక్తులు వాహనం పైన వచ్చి చలివేంద్రంలోని రంజన్ ఎత్తేకెళ్లిన వీడియో కొన్ని రోజులు క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.. చలివేంద్రం లోని వెండి గ్లాస్ లను పోలీసులు ఎత్తుకెళ్లడం ఇక్కడ విశేషం.. అది సిసి కెమెరులో రికార్డ్ అవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ చలివేంద్రం నుంచి వెండి గ్లాసును తస్కరించిన ఇద్దరు పోలీసులు బైక్ పై జారుకున్నారు. తమ కక్కుర్తికి తామే మురిసిపోయారు. అయితే, పాపం సీసి కెమెరాల పుణ్యమా అని వారి కథ అడ్డం తిరిగింది. ఇది విడియోలో రికార్డ్ కావడంతో దానిని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ విడియో విపరీతంగా వైరల్ అయింది. అది ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఆ విడియో చూసి ఖంగుతిన్న అధికారులు.. కక్కుర్తి కానిస్తేబుల్స్ కు బదిలీ శిక్ష వేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories