ప్రగతి నివేదన ఒక బాహుబలి సభ?

Submitted by arun on Sat, 09/01/2018 - 13:07
hmda

ప్రగతి నివేదన బాహుబలి బహిరంగ సభనట,

దారులన్ని అక్కడికే రహదారులు కానున్నయాట,

బాహ్యవలయ రహదారి ప్రయాణించే వాహనాలకట,

ఎలాంటి టోలు రేపు వసూలు చేయబోవడం లేదట,

అంత భారీగా తెరాస పార్టీనే భరిస్తుతుందట. శ్రీ.కో   


రేపు నిర్వహించనున్న ప్రగతి నివేదన బహిరంగ సభ సందర్భంగా, తెరాస పార్టీ అభ్యర్థన మేరకు బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై ప్రయాణించే వాహనాలకు ఎలాంటి టోలు వసూలు చేయబోవడం లేదని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి తెరాస అంగీకరించిందన్నారు. ఈ కారణంగా సెప్టెంబరు 2న ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై టోలు వసూళ్లు ఉండవని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై సగటున ప్రతీరోజు లక్ష వాహనాలు తిరుగుతుంటే గుత్తేదారు రూ.87 లక్షలు టోలు వసూలు కింద హెచ్‌ఎండీఏకు చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆ ఒక్కరోజుకు యొక్క డబ్బులు తెరాసనే జమచేస్తుందట.

English Title
toll charges levied on september 2

MORE FROM AUTHOR

RELATED ARTICLES