నేడు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

Submitted by nanireddy on Sat, 09/01/2018 - 08:06
today ycp conducts ryali in proddhutur

గతనెల 28న గుంటూరులో జరిగిన నారా హమారా-టీడీపీ హమారా సభలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారనే కారణంగా తొమ్మిది మంది ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై వైసీపీ మండిపడింది. హామీలు నెరవేర్చమని ప్లకార్డులతో నిరసన తెలిపిన పాపానికి వారిపైనే కేసులు పెట్టడం సరికాదని వాదిస్తోంది. మరోవైపు సభలో కుట్రకు పాల్పడాలనే ఉద్దేశ్యంతోనే  కొందరు ముస్లిం యువకులను వైసీపీ రెచ్చగొట్టిందని ఆరోపిస్తోంది. ఈ అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరగడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు అంటున్నారు. దాంతో ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా ఇవాళ  పొద్దుటూరులో మూడు వేల మంది ముస్లింల చేత నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు వైసీపీ మైనార్టీ విభాగం నేతలు.  

English Title
today ycp conducts ryali in proddhutur

MORE FROM AUTHOR

RELATED ARTICLES