మోడీ, మాయా డైలాగ్ వార్ అదుపు తప్పుతోందా?

మోడీ, మాయా డైలాగ్ వార్ అదుపు తప్పుతోందా?
x
Highlights

యూపీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు శృతిమించుతున్నాయి. బెహన్ జీ మాయావతి మోడీని మరీ దిగజారి విమర్శించారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ...

యూపీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు శృతిమించుతున్నాయి. బెహన్ జీ మాయావతి మోడీని మరీ దిగజారి విమర్శించారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తూర్పు యూపీలో చివరి అంకం ఎన్నికల్లో వేడెక్కిన ఆ కాంపెయిన్ వార్ ఏంటో మీరూ చూడండి. ఉత్తర ప్రదేశ్ లో చివరి యుద్ధం కొనసాగుతోంది. ఏడంచెల సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ ఎన్నికల కోసం పార్టీల ప్రచార యుద్ధం అదుపు తప్పుతోంది. ప్రధాని మోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల యుద్ధం కట్టు తప్పుతోంది.మోడీ తూర్పు యూపీలోని కుషీనగర్, డియోరియా లలో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు. అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటనపై బీఎస్పీ మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. దళితులపై మాయావతికి చిత్తశుద్ధి ఉంటే రాజస్థాన్లో కాంగ్రెస్ సర్కార్ కి మద్దతు ఎందుకు ఉపసంహరించుకోరని ప్రశ్నించారు.

మోడీ సవాల్ పై మండి పడిన మాయావతి తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. మోడీ భార్యను కూడా వదిలేశారు కాబట్టి ఆయనకు అనుబంధాల గురించి తెలియదన్నారు. బీజేపీలో పెళ్లయిన మహిళలు తమ భర్తలు మోడీ దగ్గరకెడితే చాలు తమనెక్కడ వదిలేస్తారేమోనని భయపడుతున్నారన్నారు. మాయావతి మాటలకు బీజేపీ ఘాటుగా స్పందించింది. మాయా దిగజారి మాట్లాడుతున్నారంది. మోడీ హయాంలో తామెంతో భద్రంగా ఉన్నామని బీజేపీ మహిళా నేతలు కౌంటర్ ఇచ్చారు.

అల్వార్ లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటనను చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహించి దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలన్నారు. అల్వార్ ఘటనపై సరైన టైములో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దేశంలో దళితులపై వరుస పెట్టున జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్ ఘటన, రోహిత్ వేముల ఘటన, దళితులపై జరిగిన మిగిలిన ఇతర దాడులపట్ల ప్రధాని వైఖరి ఏంటి?ఆయనెందుకు రాజీనామా చేయరు అని నిలదీశారామె.

రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాధితురాలి కుటుంబాన్ని భయపెట్టి ఈ అత్యాచార ఘటన వివరాలు బయటకు రాకుండా తొక్కి పెట్టిందని మాయావతి ఆరోపించారు. ఈఘటనలో బాధితురాలికి సుప్రీం కోర్టు సరైన న్యాయం చేయాలనికోరారు మాయావతి. రాజస్థాన్ కాంగ్రెస్ మాత్రం ఇటు మోడీని, ఇటు మాయావతిని ఇద్దరినీ ఏకి పారేసింది. మాయా చేసిన ఈకామెంట్లపై బీజేపీ ఆగ్రహంతో ఊగిపోయింది. మాయావతి సభ్యతా సంస్కారాలు వదిలేసి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories