అలీ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

అలీ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
x
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. మరొకవైపు వారికి ఓట్లు వేయొద్దు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. మరొకవైపు వారికి ఓట్లు వేయొద్దు అంటే వీరికి ఓట్లు వేయొద్దు అంటూ ఒక రాజకీయ పార్టీ పై మరొక రాజకీయ పార్టీలు సమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటూ కానీ రాజకీయ విషయాలలో కి వచ్చేసరికి మాత్రం ప్లేటు మార్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను దేవుడిగా కొలిచే బండ్ల గణేష్ జనసేన జెండా పుచ్చుకోలేదు. మరొకవైపు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే కమెడియన్ అలీ కూడా జనసేన వైపు రాలేదు.

ఈ మధ్యనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అలీ, జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపించి వైకాపా తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అలీ గురించి రియాక్ట్ అయ్యారు. అలీ తనకు ఇప్పటికి కూడా మంచి మిత్రుడేనని అతనికి ఏ పార్టీ వైపు వెళ్లాలనిపిస్తే అటు వైపు వెళ్లే స్వేచ్ఛ ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మాడు కాబట్టే అటు వెళ్లాడని, అది ఆయన ఛాయిస్ అని చెప్పుకొచ్చారు జనసేనాని. మెగా కుటుంబ సభ్యుల్లో రామ్ చరణ్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పవన్ కి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories