ప్రాణం తీసిన పురుడు

ప్రాణం తీసిన పురుడు
x
Highlights

ఇది సోషల్ మీడియా యుగం. అందరూ సామాజిక మాధ్యమాలను ఫాలో అవ్వడం ఎక్కువైపోయింది. ఏ పని చేయాలనుకున్నా యూ ట్యూబ్ వీడియోలు చూడటం వెంటనే చేసేయడం, అలా ఇద్దరు...

ఇది సోషల్ మీడియా యుగం. అందరూ సామాజిక మాధ్యమాలను ఫాలో అవ్వడం ఎక్కువైపోయింది. ఏ పని చేయాలనుకున్నా యూ ట్యూబ్ వీడియోలు చూడటం వెంటనే చేసేయడం, అలా ఇద్దరు దంపతులు యూ ట్యూబ్ వీడియోలను చూసి..ప్రమాదకర ప్రయోగం చేయాలనుకున్నారు. భార్యకు ఇంట్లోనే తానే డెలివరీ చేయలనుకున్నాడు భర్త. యూ ట్యూబ్ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ దంపతుల వింత ఆలోచన కారణంగా నిండు ప్రాణం పోయింది. పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవ వేదన అనుభవించిన ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందింది.

యూ ట్యూబ్ డెలివరీ విషాద ఘటన తమిళనాడులోని జరిగింది. జూలై 22న జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలిని తిరుపూర్‌లోని రత్న గిరీశ్వరనగర్‌కు చెందిన కృతికగా గుర్తించారు. కృతిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల పాప ఉంది. ఈ దంపతులిద్దరూ యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నారు. డెలివరీ సమయంలో ప్రెగ్నెంట్ లేడీకి ఎలా సాయం అందించాలి..? అనే వీడియోలను యూట్యూబ్‌లో చూశారు. అనుకున్నట్టే చేశారు. కానీ ప్రయోగం వికటించి భార్య చనిపోయింది.

భర్త భార్యకు విజయవంతంగా పురుడు పోసినా చివర్లో మాత్రం పరిస్థితి చేయిదాటిపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కృతికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. పురిటి నొప్పులు మొదలైన గంటన్నర తర్వాత కృతికను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కృతిక భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు లావణ్య సహజ ప్రసవాలు చేస్తుండేదనీ ఆమె సూచనతోనే ఆ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories