logo

పోటీచేసే 12 స్థానాలను ప్రకటించిన టీజేఎస్

పోటీచేసే 12 స్థానాలను ప్రకటించిన టీజేఎస్

మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జనసమితి పార్టీ (టీజేఎస్) ఈ ఎన్నికల్లో పోటీచేసే 12 స్థానాలను ప్రకటించింది. పొత్తులో భాగంగా 12 సీట్లకు ఒప్పుకున్న టీజేఎస్ ఆ 12 స్థానాల జాబితాను విడుదల చేసింది. అందులో 1.దుబ్బాక 2.మెదక్ 3.మల్కాజ్‌గిరి 4.అంబర్‌పేట 5.సిద్ధిపేట 6.వరంగల్ తూర్పు 7.వర్దన్నపేట 8.ఆసిఫాబాద్ 9.స్టేషన్‌ఘనపూర్ 10.జనగామ 11.మహబూబ్‌నగర్ 12.మిర్యాలగూడ లను ప్రకటించగా ఆసిఫాబాద్, స్టేషన్‌ఘనపూర్ స్థానాలలో కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. ఈ రెండు నియోజకవర్గాలపై రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అలాగే కూటమిలో మరో భాగస్వామి అయిన టీడీపీ ఇప్పటికే 9మంది అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మహబూబునగర్ అభ్యర్థిని ప్రకటించటం మరో విశేషం.

లైవ్ టీవి

Share it
Top