మోడీ గడ్డపై ఆడేదెవరు.. ఓడేదెవరు?

మోడీ గడ్డపై ఆడేదెవరు.. ఓడేదెవరు?
x
Highlights

సొంత రాష్ట్రంలో మోడీ పరిస్థితి ఏంటి? కిందటిసారి కంటే గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌‌ను ఢీకొట్టే వ్యూహమేంటి? మోడీ రోడ్‌షో, తర్వాత బహిరంగ సభలు.....

సొంత రాష్ట్రంలో మోడీ పరిస్థితి ఏంటి? కిందటిసారి కంటే గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌‌ను ఢీకొట్టే వ్యూహమేంటి? మోడీ రోడ్‌షో, తర్వాత బహిరంగ సభలు.. ప్రసంగాలు, ప్రచారాలు కమలానికి కలిసొస్తాయా? సీఎంగా పదమూడేళ్ల పాలన పీఎంకు మళ్లీ పట్టం కడుతుందన్న కమలనాథల కల నెరవేరుతుందా? ఇంతకీ మోడీ గడ్డపై నెగ్గేదెవరు..నిలిచేదెవరు?

2014 ఎన్నికల్లో బీజేపీ వంద శాతం సీట్లు సొంతం చేసుకుంది. ఈసారి సత్తా చాటాలన్న కుతూహలంతో ఉన్న కాంగ్రెస్‌.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులకు షాకిచ్చింది. దీంతో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్ అంటూ గుజరాత్‌ ప్రజలను జాగృతం చేస్తున్న అమిత్‌షాను రంగంలోకి దిగడంతో సీను కొంచం మారినట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో యావత్‌దేశమంతా గుజరాత్‌ వైపే చూస్తోంది. గత ఏడాది అన్ని స్థానాలను సొంతం చేసుకున్న బీజేపీ ఈసారి ఏం చేస్తారన్నదే ఆసక్తే.

ఇక ముఖ్యమంత్రిగా మోడీ అందించిన పాలన ఇప్పుడు గుజరాత్‌లో బీజేపీకి కలిసి వస్తుందన్నది కమలనాథుల ఆశ. అయితే భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఈసారి కాంగ్రెస్‌ గట్టి సవాల్‌ విసురుతోంది. సాధ్యమైనన్ని స్థానాలు దక్కించుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. 12 నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇస్తున్న కాంగ్రెస్‌. బీజేపీకి చెక్‌ పెట్టాలన్న వ్యూహానికి పదును పెడుతోంది. 2017 శాసనసభ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకొని బొటాబొటి మెజారిటీతో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులకు... ఇప్పుడూ అదే తీరు ఫలితాలు ఎదురవుతాయన్న గుబులు లేకపోలేదు.

ఆనందీబెన్‌ పటేల్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా, చక్రం తిప్పేది మాత్రం అమిత్‌షానే కావడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది. తర్వాతి పరిణామాల్లో ఆనందీబెన్‌ను మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పంపి, ఆమె స్థానంలో అమిత్‌షా వర్గీయుడైన విజయ్‌ రూపాణీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పటికీ షా-బెన్‌ వర్గాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉందని... ఫలితంగా పాలన గాడి తప్పి, ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదనే విమర్శలున్నాయి.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ 13 ఏళ్లపాటు పాలించారు. రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన నేతగా చరిత్రకెక్కారు. పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే గుజరాత్‌ను ముందుంచారు. 2014లో ఆయన ప్రధాని కావడంలో గుజరాత్‌ పాత్ర కీలమైంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలనూ బీజేపీకే కట్టబెట్టి ఆయన పట్ల తమకున్న ప్రేమను గుజరాత్‌ ప్రజలు చాటుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పురిటిగడ్డ గుజరాతే. ఇంతటి ప్రాధాన్యమున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి సవాలు ఎదురుకావడం కాషాయపార్టీకి మింగుడుపడటం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories