భోజ‌నం చేసిన వెంట‌నే ఈ ప‌నులు చేస్తే మీ పని అంతే....

భోజ‌నం చేసిన వెంట‌నే ఈ ప‌నులు చేస్తే  మీ పని అంతే....
x
Highlights

రాత్రి పూట భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతారు... కొందరు పడుకుంటారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. లేదా గ్యాప్...

రాత్రి పూట భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతారు... కొందరు పడుకుంటారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. లేదా గ్యాప్ ఇవ్వకుండా పండ్లను తింటారు..అయితే వాస్తవంగా చెప్పాలంటే డిన్నర్ తరువాత ఈ పనులను అస్సలు చేయకూడదు. ఇవే కాదు, ఇలాంటివే కొన్ని పనులను రాత్రి పూట డిన్నర్ అవగానే చేయకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ స్మోకింగ్ చేయ‌కూడదు...అలా చేస్తే పొగాకులో ఉండే నికోటిన్ మ‌న శ‌రీరంలో జరిగే జీర్ణ క్రియ‌ను అడ్డుకుంటుంది. క‌ాబట్టి భోజ‌నం చేశాక పొగ తాగకూడదు. భోజ‌నం చేసిన వెంట‌నే స్నానం కూడా చేయ‌కూడదు. చేస్తే జీర్ణ ప్రక్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి. ఒకవేళ స్నానం చేయాలనుకుంటే తిన్న తరువాత క‌నీసం 40 నిమిషాల వ‌ర‌కు అయినా ఆగితే మంచిది.

చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే పండ్లను తింటుంటారు. కానీ అలా చేయ‌కూడదు. ఎందుకంటే మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సరిగ్గా గ్రహించాలంటే పండ్లను తిన‌రాదు. అయితే పండ్లను తినాలంటే భోజ‌నం చేశాక క‌నీసం 60 నిమిషాల వ్యవ‌ధి ఉండేలా చూసుకోవాలి.

భోజనం చేశాక గ్రీన్ టీ తాగ‌కూడదు. తాగితే శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐర‌న్‌ను స‌రిగ్గా గ్రహించ‌లేదు. లాస్ట్ బట్‌ నాట్ లీస్ట్‌ భోజనం చేసిన వెంట‌నే వ్యాయామం చేయకూడదు...టీ, కాఫీలు తాగ‌కూడదురాదు. అలాగే ఎక్కువ సేపు కూడా కూర్చోకూడదు. కొంత సేపు అటు, ఇటు న‌డ‌వాలి. అలాగే తిన్న వెంట‌నే నిపడుకోకూడదు.అలా చేస్తే గ్యాస్ వ‌స్తుంది. అధికంగా బ‌రువు పెరుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories