ద్రోణాచలంలో అరుణాచలం ఎవరు...రెండు కుటుంబాల యుద్ధంలో విజేత ఎవరు?

ద్రోణాచలంలో అరుణాచలం ఎవరు...రెండు కుటుంబాల యుద్ధంలో విజేత ఎవరు?
x
Highlights

ద్రోణాచలంలో అరుణాచలం ఎవరు రెండు కుటుంబాల యుద్ధంలో విజేత ఎవరు దశాబ్దాల ఆధిపత్య పోరులో ఈసారి తొడగొట్టెదెవరు ప్రత్యర్థిని పడగొట్టేదెవరు శత్రువు శత్రువు...

ద్రోణాచలంలో అరుణాచలం ఎవరు రెండు కుటుంబాల యుద్ధంలో విజేత ఎవరు దశాబ్దాల ఆధిపత్య పోరులో ఈసారి తొడగొట్టెదెవరు ప్రత్యర్థిని పడగొట్టేదెవరు శత్రువు శత్రువు కలిసి మిత్రులైన వేళ, అక్కడ జెండా పాతేదెవరు కర్నూలు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన డోన్‌ నియోజకవర్గంలో గెలుపోటముల సయ్యాటలపై స్పెషల్ స్టోరి చూద్దాం.

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వర్గ పోరుకు, కుటుంబాల సమరానికి కేరాఫ్‌ అడ్రస్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. డోన్‌‌ అసలు పేరు ద్రోణాచలం. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్ధానం వుంది. ఈ సెగ్మెంట్‌లో ఎమ్ఎల్ఏలుగా విధులు నిర్వహించిన వారు ప్రజాపద్దుల కమిటి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కేయి క్రిష్ణమూర్తి ఈ నియోజకవర్గం నుంచి తన సత్తా చాటడమే కాకుండా, వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. వీటితో పాటు పీఏసీ చైర్మన్‌గా విధులు నిర్వహంచారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా వున్న బుగ్గన రాంజేంద్రనాథ్‌ రెడ్డి కూడా పీఏసీ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈసారి మళ్లీ వైసీపీ తరుపున బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా తన సోదరుడు కె.ఈ. ప్రతాప్‌ను పోటీకి పెట్టారు ఉపముఖ్యమంత్రి కె.ఈ. క్రిష్ణమూర్తి. దీంతో మరోసారి పోరు రసవత్తరంగా మారింది.

ఓసారి నియోజకవర్గ వివరాలు చూస్తే డోన్ మునిసిపాలిటీతో పాటు బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు వున్నాయి. మొత్తం ఓటర్లు 2,19,678. ఇందులో పురుషులు 1,09,248 కాగా, మహిళలు 1,10,357 మంది. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 78.94 కాగా, 2014లో ఓటింగ్ శాతం 73.34. గతంతో పోలీస్తే ఈసారి ఓటింగ్ శాతం నియోజకవర్గంలో భారీగానే పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలిస్తుందని ఇద్దరు అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. బూతుస్థాయి కార్యకర్తల నుంచి ప్రత్యేకంగా పిలిపించుకుని ఓటింగ్ సరళిపై అంచనాలు వేస్తున్నారు. వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్‌తో గెలుపు తమదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో వున్న మూడు మండలాలలో బీసి ఓటర్లు ఎక్కువగా వున్నారు. అందుకే బీసీ అయిన కె.ఈ. కుటుంబానికి ఈ నియోజకవర్గం ప్రజలు ఎక్కువగా పట్టంకడుతూ వచ్చారు. డోన్‌ను తన కంచుకోటగా మార్చుకున్నారు కె.ఈ. అయితే 2004 వైయస్సార్ ప్రభంజనంలో కె.ఈ. కంచుకోటకు బీటలు పడ్డాయి. 2009లో మాత్రం తిరిగి కె.ఈ. కుటుంబం టీడీపీ జెండాను ఎగురవేసింది. ఇప్పటి వరకు ఆరుసార్లు డోన్‌లో జయకేతనం ఎగుర వేశారు కె.ఈ. క్రిష్ణ మూర్తి.

2014లో మాత్రం రాజకీయాల్లో తొలిసారిగా అడుగు పెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. పీఏసీ చైర్మన్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాగ్దాటి, విషయ పరిజ్ణానం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. మరోసారి పోరులో నిలిచారు.

అయితే డోన్‌‌లో గెలుపుపై ఎవరి దీమా వారిదే. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీసి ఓట్ బ్యాంకింగ్ తమకు శ్రీరామ రక్ష అన్న గట్టి నమ్మకంతో టీడీపీ నేతలున్నారు. దీనికితోడు డోన్‌లో ప్రాబల్యమున్న కోట్ల కుటుంబం సైతం టీడీపీలో చేరడం మరింత బలంగా భావిస్తోంది సైకిల్‌ పార్టీ. అటు ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వున్న అభిమానం, పార్టీపై రైతుల్లో వున్న విశ్వాసం, బుగ్గన వ్యక్తిగత ప్రతిష్ట, తమకు విజయాన్ని అందిస్తాయన్న దీమాతో వున్నారు వైసీపీ నేతలు. ఇక్కడి నుంచి మిగిలిన పార్టీ నేతలు పోటీలో వున్నా, ప్రధానంగా పోటీ మాత్రం టీడీపీ,వైసీపీల మధ్యనే.

Show Full Article
Print Article
Next Story
More Stories