వనస్థలిపురంలో ఇసుక లారీ భీభత్సం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

వనస్థలిపురంలో ఇసుక లారీ భీభత్సం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
x
Highlights

ఆఫీసుకెళ్లాలన్నా, స్కూలుకెళ్లాలన్నా, ఎక్కడికెళ్లాలన్నా ఎవరైనా సరే రోడ్డెక్కాల్సిందే. అయితే అవే రోడ్లు మృత్యు మార్గాలైతే.. రోడ్డుపైకి రావడానికే...

ఆఫీసుకెళ్లాలన్నా, స్కూలుకెళ్లాలన్నా, ఎక్కడికెళ్లాలన్నా ఎవరైనా సరే రోడ్డెక్కాల్సిందే. అయితే అవే రోడ్లు మృత్యు మార్గాలైతే.. రోడ్డుపైకి రావడానికే భయపడతారు. సరిగ్గా వనస్థలిపురం సుష్మా థియేటర్‌ దగ్గర అదే జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారు రోడ్డుపైకి రావడానికి జడసుకుంటున్నారు. అంత బీభత్సం సృష్టించిందో ఇసుక లారీ.

కనుమ అయిపోయింది. తెల్లారి అంతా బిజీబిజీగా ఆఫీసులకు, పనులకు వెళుతున్నారు. హైదరాబాద్‌ వనస్థలి పురంలో ఉదయం పూట ట్రాఫిక్‌ బీభత్సంగా ఉంటుంది. కాలేజీలకు వెళ్లేవాళ్లు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు, రోజువారీ పనులకు వెళ్లే వాళ్లతో వనస్థలిపురం మెయిన్‌ రోడ్డు బిజీగా ఉంది. రోజులానే ఏ హడావుడి లేకుండా ఎవరి దారిన వారు పోతున్నారు. ఉన్నట్టుండి.. పూనకం పట్టినట్లు ఇసుక లారీ వాహనాలపైకి దూసుకొచ్చింది. సిక్స్‌ సీటర్‌ ఆటోను ఢీకొట్టింది. లారీ దెబ్బకి.. సిక్స్‌ సీటర్‌ వెహికల్‌ ముందుకెళ్లి పోయింది. పక్కగా ఉన్న మోటార్‌ బైకుల్ని, నాలుగు ఆటోలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది.

ప్రశాంతంగా ఉన్న వనస్థలిపురం రోడ్డు కాస్త కొన్ని సెకన్లలో మరుభూమిగా మారిపోయింది. శవాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. మరికొద్ది మందికి కాళ్లు చేతులూ విరిగాయి. ఉన్నట్టుండి.. ఇసుక లారీ ఇలా దూసుకొని రావడం, మృత్యకాండ సృష్టించడంతో.. స్థానిక సుష్మా ధియేటర్‌ ప్రాంత వాసులు భయోత్పాతానికి గురయ్యారు. కంగారుగా అటు ఇటూ పరుగులు తీశారు.

ఇసుక లారీ సృష్టించిన బీభత్సంలో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిన అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇంత విషాదానికి కారణమైన ఇసుక లారీని డ్రైవర్‌ వదిలేసి పరారయ్యాడు. లారీ యజమాని కోసం, డ్రైవర్‌ కోసం పోలీసులు గాలింపు మొదలెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories