కృష్ణాజిల్లాకు పిడుగుల హెచ్చరిక

Submitted by arun on Sat, 06/02/2018 - 15:42
Thunderstorm

ఆంధ్ర ప్రదేశ్‌కు మరోసారి పిడుగు ముప్పు పొంచి ఉంది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీకృష్ణదేవరాయల వారి కోటపై పిడుగు పడింది. పిడుగు ధాటికి....రాజగోపురం పెచ్చులూడిపోయింది. ఎత్తయిన రాజగోపురంపై పిడుగులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే అపురూప కట్టడం పాడవుతోందని పర్యాటకులు విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో మారిన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పలుచోట్ల పిడుగులు పడుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. కలెక్టర్లు క్రింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి అందుకనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
 

English Title
Thunderstorm warning issued in AP

MORE FROM AUTHOR

RELATED ARTICLES