మిర్యాలగూడ ఘటన మరువకముందే మరో దారుణం

Submitted by arun on Wed, 09/19/2018 - 17:10
love couple

మిర్యాల గూడ విషాదం కళ్ల ముందు మెదులుతుండగానే మరో విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి మేనమామ దాడికి పాల్పడిన ఘటన  ఎర్రగడ్డలో జరిగింది. బోరబండకు చెందిన నవదీప్‌, మాధవి నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి మేనమామ ప్రేమికులిద్దరు స్కూటర్‌పై ఉండగా .. వచ్చి కత్తతో దాడి  చేశాడు.  ఈఘటనలో కత్తి వేటు ధాటికి  అమ్మాయి మాధవి చెయ్యి రెండు మీటర్ల దూరం ఎగిరి పడింది. దాడి అనంతరం అమ్మాయి మేనమామ పారిపోయాడు. 

ఈ ఘటనలో పక్కా ప్లాన్ ప్రకారమే అమ్మాయి మేనమామ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రేమికులిద్దరూ స్కూటర్‌పై ఉండగా పథకం ప్రకారం అక్కడికి వచ్చిన అమ్మాయి మేనమామ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో  అబ్బాయిపై దాడికి దిగాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అమ్మాయిపై దాడి దిగిన మేనమామ కత్తితో మెడపై నరికాడు. అయినా అడ్డుకునేందుకు ప్రయత్నించంతో చేయి నరికాడు. కత్తి వేటు ధాటికి అమ్మాయి చేయి రెండు మీటర్ల మేర దూరం పడింది. మాధవిని చుట్టుపక్కల వారు నీలిమ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్ధితి విషమంగా ఉండటంతో సోమాజీగూడ యశోదా ఆసుప్రతికి తరలించారు. 

నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఈ పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో అమ్మాయి మేనమామ దాడికి దిగాడు. నిత్యం జనసామర్ధ్యం ఉండే రోడ్డుపై ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయి మేనమామ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

English Title
Thugs charge on lover couple in Erragadda

MORE FROM AUTHOR

RELATED ARTICLES