నూకలు చెల్లిన బతుకులు

Submitted by arun on Sat, 07/28/2018 - 11:59
Delhi

అయ్యో అందక కొన్ని నూకలు,

ప్రాణము విడిచెను ఆకలి కేకలు,

ఏమి చేస్తున్నాయి ఢిల్లీ బాబుల మూకలు,

వినపడలేద వారికెవరికి ఈ శోకాలు. శ్రీ.కో
దేశ రాజధాని ఢిల్లీకి బతుకు దెరువు కోసం వలస వచ్చింది పశ్చిమ బెంగాల్‌ మిడ్నాపూర్‌కు చెందిన మంగళ్ కుటుంబం.. పిల్లలకి సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాడు. మగళ్ భార్య కూడా ఇల్లు గడవడం కోసం పనులకు వెళ్ళేది. కొంతకాలానికి ఆ కుటుంబంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రమాదంలో గాయపడి మంగళ్ భార్య మతి స్థిమితం కోల్పోయింది. దీంతో పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు. ఆకలికి తాళలేక వీధుల్లో అడుక్కోవడం మొదలు పెట్టారు ముగ్గురు చిన్నారులు. దొరికిన రోజు తినడం లేని రోజు పస్తులుండడంతో చిక్కి శల్యమయ్యారు. దీంతో రోజురోజుకు నీరసించి రెండురోజుల కిందట మరణించారు. పోలీసులు వారి మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తే ముగ్గురు పిల్లలు ఆహారం లేకనే శరీర అవయవాలన్నీ పాడైపోయాయని, కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్ అమిత్ సక్సేనా తెలిపారు.

Tags
English Title
Three Delhi sisters died of ‘severe malnutrition’, say doctors

MORE FROM AUTHOR

RELATED ARTICLES