సీబీఎస్ఈ లీకేజీ : మ‌గ్గురు నిందితులు అరెస్ట్

సీబీఎస్ఈ లీకేజీ : మ‌గ్గురు నిందితులు అరెస్ట్
x
Highlights

పేప‌ర్ లీకేజీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 28 న దేశం మెత్తం జరిగిన మాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొద్ది సేపటి...

పేప‌ర్ లీకేజీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 28 న దేశం మెత్తం జరిగిన మాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొద్ది సేపటి ముందు CBSE చైర్ పర్సన్ అనితా కర్వాల్ కి వాట్సాప్ ద్వారా క్వ‌చ్చ‌న్ పేప‌ర్ లీక్ అయిన‌ట్లు మెయిల్ వ‌చ్చింది. క్వ‌శ్చ‌న్ పేపర్ ను అటాచ్ చేసి ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఓ విద్యార్ధి తన తండ్రి జీ మెయిల్ అకౌంట్ ద్వారా చైర్మన్ కు విజ్ణప్తి చేశాడు. అయితే ఎగ్జామ్ నిర్ణయించిన సమయానికి యధావిధిగా జరిగినప్పటికీ అదే రోజున CBSE అధికారులు క్రైం బ్రాంచి పోలీసులకు ఈ విషయమై కంఫ్లెయింట్ చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనిపై విచారణ ప్రారంభించింది. పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి జవదేకర్ స్పందించారు. 16 లక్షల మంది సీబీఎస్‌ఈ మ్యాథ్స్ పేపర్ రాశారని, అయితే అందులో 14 లక్షల మంది మళ్లీ ఆ పేపర్‌ను రాయాల్సిన అవసరం లేదని జవదేకర్ తెలిపారు.
ఇదిలా ఉంటే సీబీఎస్ఈ పేపర్ల లీక్ కుంభకోణంలో ఢిల్లీ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. లీకేజీకి సంబంధించి 60మందిని విచారించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు టీచర్లతో పాటు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కూడ ఉన్నారు.
ఔటర్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన రిషబ్, రోహిత్‌లు పేపర్ల ఇమేజ్‌లను తీసి వాటిని ఓ కోచింగ్ సెంటర్‌కు పంపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తాకిర్‌ విద్యార్ధులకు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సీబీఎస్ఈ పేపర్ల లీకేజీలో చేతిరాతతో కూడ పేపర్ కూడ బహిర్గతమైంది. ఈ కేసు విచారణ కూడ పురోగతిలో ఉందని అధికారులు ప్రకటించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంటకు ముందే ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అవుతోందని ఓ విద్యార్ధి సీబీఎస్ఈ బోర్డుకు మెయిల్ చేశారు. ఈ క్రమంలో విద్యార్ధితో పాటు ఆయన తండ్రిని కూడ పోలీసులు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories