logo

‘తొలిప్రేమ’ టాక్: మాట నిలబెట్టుకున్న వరుణ్

‘తొలిప్రేమ’ టాక్: మాట నిలబెట్టుకున్న వరుణ్

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. యూత్ కి నచ్చేలా..అందమైన ప్రేమకథని అంతే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ వెంకి అట్లూరి. మ్యూజిక్ కూడా మనుస్సుకు హత్తుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఫస్ట్ ఆఫ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కి..వరుణ్ తేజ్ తొలిప్రేమకి అన్నింట్లోనూ డిఫరెన్స్ ఉన్నప్పటికీ..ఫీల్ మాత్రం ఎక్కడా మిస్సవ్వలేదు. వరుణ్ తేజ్ లవర్ బాయ్ క్రేజ్ ని తీసుకొచ్చే సినిమా తొలిప్రేమ. రాశిఖన్నా తన యాక్టింగ్ తో..ఇంతకుముందు సినిమాలకన్నా..ఈ సినిమాలో ఎక్కువ మార్కులే కొట్టేసింది. మొత్తానికి తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

లైవ్ టీవి

Share it
Top