ఈ ఐదు ఇంట్లో ఉంటే అపార సంపదలే

ఈ ఐదు ఇంట్లో ఉంటే అపార సంపదలే
x
Highlights

కుంతి, ద్రౌపదితో కలిసి హస్తినకు చేరుకున్న పాండవులకు ద్రుతరాష్ర్టుడు, గాంధారి, బీష్ముడుతోపాటు మిగతా కురుకుల యోధులంతా ఘనంగా స్వాగతం పలుకుతారు....

కుంతి, ద్రౌపదితో కలిసి హస్తినకు చేరుకున్న పాండవులకు ద్రుతరాష్ర్టుడు, గాంధారి, బీష్ముడుతోపాటు మిగతా కురుకుల యోధులంతా ఘనంగా స్వాగతం పలుకుతారు. పాండవాగ్రజుడు ధర్మరాజును యువరాజుగా ప్రకటించాలని హస్తినాపుర ప్రజలు కోరుకోవడంతో ధ్రుతరాష్ర్టుడు పట్టాభిషేకానికి అంగీకరిస్తాడు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణుడు కూడా విచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు, ధర్మరాజు మధ్య హస్తినాపుర రాజ్య భవిష్యత్తుపై సంవాదం చోటు చేసుకుంటుంది.రాజ్యంలో శ్రేయస్సు కోసం ఏం చేయాలో ఆ గోపాలుడిని తెలపమంటూ ధర్మరాజు కోరతాడు. అప్పుడు ఈ కింది అయిదు వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే జీవితంలో అపారమైన సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా ధర్మరాజుతో చెబుతాడు. కేవలం సంపదే కాదు అనుకూల శక్తితో పాటు మనసు, ఆత్మ పరిశుభ్రంగా ఉంటాయి.

నీళ్లు
హిందూ సంప్రదాయంలో దేవుడికి భక్తితో నీటిని సమర్పిస్తారు. సూర్యుడితోపాటు ఇతర దేవతలకు అర్యెం ఇస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన అతిథులకు ముందు తాగడానికి నీళ్లిస్తారు. ఇలా చేయడం వల్ల మేలు జరిగి సంపద ప్రవాహం మాదిరిగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

చందనం
విషపూరితమైన పాములు వేలాదిగా గంధపు చెట్లును చుట్టుకుని ఉన్నా దాని సువాసన మాత్రం కోల్పోదు. అలాగే గంధం చెక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు లోనికి ప్రవేశించలేవు. జ్యోతిషం ప్రకారం గంధం అరగదీసి దేవుని విగ్రహాంతోపాటు నుదుటిపై తిలకంగా దిద్దుకుంటే ఎంతో పవిత్రత చేకూరుతుంది. అలాగే సంపద అయస్కాంతంలా అట్టిపెట్టుకుంటుంది.

నెయ్యి
ఆవు హిందువులకు ఎంతో పవిత్రమైంది. అవు పాల నుంచి తయారు చేసిన నేయి కూడా ఎంతో భక్తితో కూడుకున్నదిగా భావిస్తారు. ఇంట్లో ఆవు నేతితో దీపం వెలిగించి దేవతలను పూజించేవాళ్లను గౌరవమైన భక్తులుగా నమ్ముతారు. బయట మార్కెట్‌లో లభ్యమయ్యే దానితో కాకుండా ఇంట్లో స్వంతంగా నెయ్యి తయారు చేసుకుంటే ఆరోగ్యంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందట.

వీణ
కమలంపై ఆశీనురాలైన సరస్వతిని ముట్టుకోరాదట. ఇలా చేస్తే పేదరికంతోపాటు అనిశ్చితికి కారణమవుతుందట. అలాగే ఆమె విగ్రహం గానీ, వీణ గానీ ఇంట్లో ఉంటే మంచి జరగదట.

తేనే
తేనె కేవలం మనుషులకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుందట. పరిశుభ్రమైన ప్రదేశంలో తేనె ఉంచి, కుటుంబంలోని సభ్యులందరూ రోజు తీసుకోవాలట. ఆర్థికపరమైన అనిశ్చితిని తొలగించడంతోపాటు అధిక ఖర్చులను కూడా అరికడుతుందట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories