బెంగాల్ లో గుండస్వామ్యం నడుస్తుంది : మోడీ

బెంగాల్ లో గుండస్వామ్యం నడుస్తుంది : మోడీ
x
Highlights

ఈ ఎన్నకల్లో ప్రధాని మోడీ మరియు పచ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది . తాజాగా మరోసారి దీదీ పై విమర్శలు చేసారు ప్రధాని...

ఈ ఎన్నకల్లో ప్రధాని మోడీ మరియు పచ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది . తాజాగా మరోసారి దీదీ పై విమర్శలు చేసారు ప్రధాని మోడీ .. మమత బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని గుండస్వామ్యంగా మార్చేశారని ద్వజమెత్తారు ..

తృణముల్ గుండాలు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఇది ఇక పై చెల్లదని స్పష్టం చేసారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పచ్చిమబెంగాల్ లోని పలు నియోజకవర్గాలలో పర్యటించిన మోడీ దీదీపై ఈ వాఖ్యలు చేసారు . అసలు దీదీ అధికారంలో కొనసాగే హక్కు కూడా ఆమెకు లేదని త్వరలోనే ఆమెను అధికారం నుండి దించేందుకు ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు .

దీదీ పై వంగ్యంగా మాట్లాడారు మోడీ . " దీదీ మీరు మంచి చిత్రకారిణి అని విన్నాను . మీరు నా చిత్రాన్ని గీసి నాకు బహుమతిగా ఇవ్వండి . నేను దానిని జీవితాంతం దాచుకుంటాను . మీపైన కేసును పెట్టాను లెండి" అంటూ వాఖ్యానించారు మోడీ ..

అంతే కాకుండా దీదీ ముఖచిత్రాన్ని ఫేస్ బుక్ లో మార్ఫింగ్ చేసారని బీజేపి మహిళను అరెస్ట్ చేసిన వైనాన్ని మోడీ పరోక్షంగా స్పందించారు . పచ్చిమ బెంగాల్ లో బీజేపి 40స్థానంలో గెలవబోతుందని దీనితో తమ స్థానాలు ౩౦౦కి దాటిపోతాయని మోడీ ధీమా వ్యక్తం చేసారు .

Show Full Article
Print Article
Next Story
More Stories