సైకిల్ ఎక్కిన సాయి పల్లవి .. ఏంటి అ కథ..?

సైకిల్ ఎక్కిన సాయి పల్లవి .. ఏంటి అ కథ..?
x
Highlights

మలయాళం భామ సాయి పల్లవి సైకిల్ ఎక్కింది. టిడిపిలోకి వెళ్ళిందని అనుకుంటే కచ్చితంగా పొరపాటే అవుతుంది . సినిమా ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించిన కొన్ని...

మలయాళం భామ సాయి పల్లవి సైకిల్ ఎక్కింది. టిడిపిలోకి వెళ్ళిందని అనుకుంటే కచ్చితంగా పొరపాటే అవుతుంది . సినిమా ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించిన కొన్ని లీక్ లు అవడం అనేది ఈ మధ్య తరచుగా జరుగుతూనే ఉంది కదా ..! అందులో భాగంగానే సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాకి సంబంధించిన ఓ క్లిప్ లీక్ అయింది . ఇందులో సైకల్ తొక్కుతూ సాయి పల్లవి వెళ్తున్నట్టుగా ఉంది .. ' నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఉడుగుల రెండో ప్రయత్నంగా ఈ విరాటపర్వం తెరకెక్కుతుంది . ఈ సినిమా నక్సలిజం నేపధ్యంలో తెరకెక్కుతుంది . ఇందులో సాయి పల్లవి అడవిలో అక్క పాత్రలో నటిస్తుంది . ఇందులో రాణా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు . ఈ మధ్య ఈ సినిమా మొదటి షెడ్యుల్ ని కంప్లీట్ చేసుకుంది . అప్పుడే సినిమాకి సంబంధించిన లీకులు మొదలు కావడంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..





Show Full Article
Print Article
Next Story
More Stories