పక్కదారి పడుతున్నఆసరా పెన్షన్లు...చచ్చిన వారి పేరుతో పెన్షన్లు మింగుతున్నఅధికారులు

aasara pension
x
aasara pension
Highlights

ఆసరా అభాసుపాలవుతోంది. పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్దిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బులను అధికారులు మధ్యలోనే మింగేస్తున్నారు. పండుటాకులకు ఇచ్చే చిన్నమొత్తాన్ని కూడా బొక్కేస్తున్నారు.

ఆసరా అభాసుపాలవుతోంది. పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్దిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బులను అధికారులు మధ్యలోనే మింగేస్తున్నారు. పండుటాకులకు ఇచ్చే చిన్నమొత్తాన్ని కూడా బొక్కేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో చచ్చిన వారి పేరుతో పెన్షన్లు మింగుతున్న తీరుపై హెచ్ ఎంటీవీ ప్రత్యేక కథనం

మంచిర్యాల జిల్లాలో పెన్షన్లు ప్రక్కదారి పడుతున్నాయి. చెన్నూరు మండలం దుగ్నాపల్లిలో చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్లు కాజేసుస్తున్నట్లు అదికారుల విచారణలో బయట పడింది. ఈ గ్రామంలో బోబ్బిలి ఎల్లక్క మూడు సంవత్సరాల క్రితం మరణించింది. కోండ్ర ఎల్లయ్య అదే సంవత్సరంలో మరణించాడు కాని మూడు సంవత్సరాలుగా వారి పేరిట అధికారులు పెన్షన్లు తీసుకుంటున్నారు. అదేవిధంగా అక్రుతి లింగయ్య, బ్రహ్మయ్య, మొల్ల దానయ్య, అక్రుతి దానయ్య, గుండ్ల రాజారెడ్డి మరికొంతమంది చనిపోయారు.

కాని గ్రామ పోస్టల్ బ్రాంచ్ మెనేజర్ రాజరెడ్డి వచ్చిన వారి పేర్ల మీద లక్షల రూపాయలు మింగేశారు. జిల్లా పోస్టల్ అదికారుల విచారణలో వెల్లడైంది. ఈ పేన్షన్ల కుంబకోణం మూడు, నాలుగు సంవత్సరాల నుండి గుట్టు చప్పుడు కాకుండా చచ్చిన వారి పేరుతో కాజేశారు ఏకంగా బ్రాంచ్ మేనెజర్ లబ్ధిదారుల వేలి ముద్రలు వేసి ఆసరా పెన్షన్లు తీసుకోవడం విశేషం. పోస్టల్ అదికారితో, గ్రామ అదికారులకు కూడా కుంభకోణంతో సంబంధం ఉందని అదికారుల విచారణ లో తెలింది.

చనిపోయిన వారి పెన్షన్లు మింగిన బ్రాంచ్ మేనేజర్ రాజారెడ్డి పై జిల్లా పోస్టల్ అధికారులు చర్యలు తీసుకోన్నారు అవినీతి కి పాల్పడిన అధికారిపై వేటు వేయడమే కాకుండా అక్కడ పెన్షన్లు పంపిణీ చేసే బాధ్యతలను సమీప గ్రామ పంచాయితీ బ్రాంచ్ మెనేజర్‌కు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories