మంచు ముక్కను పెదవులపై రాస్తే...

మంచు ముక్కను పెదవులపై రాస్తే...
x
Highlights

ఐస్ క్యూబ్స్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతాయి.పెదవులపై మంచు ముక్కను వుంచడం ద్వారా పెదవులు...

ఐస్ క్యూబ్స్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతాయి.పెదవులపై మంచు ముక్కను వుంచడం ద్వారా పెదవులు పొడిబారకుండా వుంటాయి. పెదవులపై చర్మం తాజాగా మెరుస్తూ వుండాలంటే వాటిపై ఐసుముక్కతో మృదువుగా రాస్తుండాలి. తర్వాత వాటిపై కాస్తంత నెయ్యిని రాయడం వల్ల బయటికి వెళ్లినప్పుడు వేసుకునే లిప్‌స్టిక్‌ మెరుస్తూ కనిపిస్తుంది. పెదాలు పొడిబారే సమస్య తగ్గుతుంది. అలాగే కంటి కింద ఐస్‌తో మృదువుగా రాయడం ద్వారా నల్లని వలయాలు మాయమవుతాయి.

ముఖానికి రోజూ ఐస్ ముక్కను రుద్దితే వృద్ధాప్య ఛాయలు రావు. మేకప్‌కు ముందు ఐస్‌ ముక్కను ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత క్రీంను రాసుకుంటే చర్మ కణాల్లోకి అది నేరుగా చేరుతుంది. దీంతో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. చర్మం కూడా బిగుతుగా ఉంటుంది. ముఖం జిడ్డుగా ఉన్నప్పుడు మలినాలు తేలికగా చర్మంలో ఇంకిపోయి, మొటిమలు, మచ్చలు వస్తాయి. ఇవి పోవలంటే ఐస్ క్యూబ్స్‌తో మర్దన చేయాలి.

నిద్రలేమి లేదా ఎక్కువ గంటలు కంప్యూటర్‌పై పని చేసినప్పుడు కళ్లు అలసిపోతాయి. దీని వల్ల చర్మం కింద నీరు చేరుతుంది. అక్కడ ఉబ్బినట్లు అవుతుంది. అప్పుడు ఐస్‌క్యూబ్‌ను కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా రాస్తే ఉపశమనం కలుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories