నా విజయ రహస్యం అదే!

నా విజయ రహస్యం అదే!
x
Highlights

తక్కువ కాలం లో ఎక్కువ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక! తొలి సినిమా చలో తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుబొమ్మ గీతాగోవిందం తో యువతరం హృదయాల్లోకి...

తక్కువ కాలం లో ఎక్కువ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక! తొలి సినిమా చలో తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుబొమ్మ గీతాగోవిందం తో యువతరం హృదయాల్లోకి దూసుకుపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయి మెస్మరైజ్ చేస్తోంది రష్మిక. తెలుగు అమ్మాయిలా తెలుగు మాట్లాడటం కూడా నేర్చేసుకుని మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది.

వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నప్పటికీ సెలక్టివ్ గా సినిమాల్ని చేస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేసిందీ భామ. ఈ సినిమా జూలై నెలలో విడుదల కానుంది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమా షూటింగ్ సమయంలో చాలా శ్రద్దగా ఉంటూ సెట్స్ పై ఎవ్వరేం మాట్లాడినా శ్రద్దగా వింటానని అంటోంది రష్మిక. సెట్స్ పై ఉన్న ప్రతీ ఒక్కరినీ తనతో తెలుగులోనే మాట్లాడాలని చెప్పేదాన్నని, అలా అలా తెలుగు బాగా వంటపట్టిందని ఆమె పేర్కొంది. ఎవ్వరిది చెప్పినా వెంటనే మైండ్ లో ప్రింట్ గుద్దుకుంటానని, అందుకే తనకు ఇంత త్వరగా తెలుగు వచ్చేసిందని చెప్పింది. దర్శకులు చెప్పిన డైలాగ్స్ సహజంగా చెప్పడానికి ప్రయత్నిస్తా. బయట ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలాగే ఉంటా. అదే పద్ధతి తనకు ఇష్టమని రష్మిక చెప్పింది. తన విజయ రహస్యం కూడా అదేనంది.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన హీరోయిన్ల లిస్టులో ఉండడానికి రష్మీకి సిద్ధంగా లేదట. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో అదీ తన క్యారెక్టర్ విషయంలో అన్ని బావుంటేనే ఒకే చెబుతోంది. ఇపుడు ఈమె తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జత కట్టడానికి సిద్ధం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories