ఇక రంగంలోకి స్టార్‌ క్యాంపెయినర్లు

x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ జాబితాను తయారు చేసి ఎన్నికల సంఘానికి...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ జాబితాను తయారు చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాయి. పార్టీ, పదవి తదితర వివరాలు లేఖల్లో ప్రస్తావించాయి. టీఆర్‌ఎస్‌ తరఫున పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు 15 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను సమర్పించారు. ప్రచారంలో డిప్యూటీ సీఎంలు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మంత్రులు టి.హరీశ్‌రావు, కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్‌, సంతోశ్‌ కుమార్‌, బండా ప్రకాశ్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శులు టి.రవీందర్‌రావు, ఆర్‌.శ్రవణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఈసీకి లేఖ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్‌ తరఫున 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లతో పార్టీ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అగ్రనాయకులు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, వి.నారాయణస్వామి, అశోక్‌చవాన్‌, జి.పరమేశ్వర, మీరాకుమార్‌, డీకే శివకుమార్‌, జైరాం రమేశ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌బబ్బర్‌, నదీం జావేద్‌, రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జులు ఖుంటియా, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, సలీం అహ్మద్‌, బీఎస్‌ బోసురాజు, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌, సినీ తారలు విజయశాంతి, ఖుష్బూ, నగ్మా ఉన్నారు.

సనత్‌నగర్ టికెట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన మర్రి శశిధర్‌ రెడ్డి పేరూ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఉంది. వీరితో పాటు జైపాల్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కె.జానారెడ్డి, మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, రేణుకాచౌదరి, డీకే అరుణ, వి.హన్మంతరావు, నేరెళ్ల శారద, అనిల్‌ థామస్‌, నితిన్‌ రౌత్‌, టీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేయడంతో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కూడా కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఎన్సీపీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ప్రధాన కార్యదర్శి ప్రఫుల్‌ పటేల్‌తో పాటు 34 మంది పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటారని ఈసీకి ఆ పార్టీ లేఖ ఇచ్చింది. అలాగే, జేడీయూ నుంచి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, కె.సి.త్యాగితోపాటు 20 మంది నేతలు ప్రచారం చేస్తారని ఈసీకి లేఖ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌తోపాటు 11 మంది స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

ఆప్‌ నుంచి కేజ్రీవాల్‌, బీఎస్పీ నుంచి మాయావతితోపాటు 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు పాల్గొంటారని ఈసీకి లేఖలు ఇచ్చారు. సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, మాణిక్‌సర్కార్‌, బృందాకరత్‌, బీవీ రాఘవులు పాటు 40 మంది ప్రచారంలో పాల్గొంటారని ఏచూరి లేఖ ఇచ్చారు. మజ్లిస్‌ నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీతో పాటు ఐదుగురు ప్రచారంలో పాల్గొంటారని అసద్‌ లేఖ ఇచ్చారు. అయితే, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. నిబంధనల ప్రకారం స్టార్‌ క్యాంపెయినర్‌ ఏ నియోజక వర్గంలో పాల్గొంటే ఆ ఖర్చంతా సదరు అభ్యర్థి ఖాతాలోనే పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories