లక్కుబాబులం మేము.. లక్కుబాబులం...

లక్కుబాబులం మేము.. లక్కుబాబులం...
x
Highlights

ఆశించారు. భంగపడ్డారు. నిరీక్షించారు. నీరసపడ్డారు. ఇక చేసేదేమీ లేక గోడ దూకేద్దామని డిసైడయ్యారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల...

ఆశించారు. భంగపడ్డారు. నిరీక్షించారు. నీరసపడ్డారు. ఇక చేసేదేమీ లేక గోడ దూకేద్దామని డిసైడయ్యారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల నుంచి జంపింగ్‌ జపాంగ్‌లను ఫాలో అయిన నాయకులు చివరి నిమిషంలో టికెట్లు సాధించారు మరి గెలిచి లక్కున్న నేతలవుతారా? అందరికంటే ముందుగా గేర్లు మార్చి హైస్పీడ్‌లో దూసుకెళ్లింది కారు. వెహికల్‌ ఫుల్‌ అయ్యిందని హౌస్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టేసింది. మహాకూటమి పొత్తుల్లో, సీటు గల్లంతు అవ్వడం ఖాయమని భావించిన కొందరు కాంగ్రెస్, టీడీపీ ఆశావహులు... ప్రయత్నిస్తి పోయేదేముందని లాస్ట్‌ మినట్‌లో లక్కును పరీక్షించుకున్నారు. అందరికంటే ముందుగా, అభ్యర్థులను ప్రకటించి, టాప్‌ గేర్‌లో రయ్యిన దూసుకెళ్లింది టీఆర్ఎస్ కారు. సీటుందని పక్కా హామీ ఇస్తే చాలు హస్తంతో హ్యాండు కలిపి, కూటమి పోరులో కనీసం సైకిలైనా ఎక్కాలని కసితో ఉన్న నేతలు.. అందితే హ్యాండు లేదంటే సైకిల్‌ అంటూ, జంపయ్యారు. అనూహ్యంగా టికెట్‌ సాధించుకున్నారు.

టిక్కెట్‌ ఆశించి భంగపడిన నేతలు, గోడ దూకారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ఆశావహులు, కారెక్కేశారు. మంచిర్యాల కాంగ్రెస్‌ నాయకుడు గడ్డం అరవింద్‌రెడ్డి సీటు వస్తుందన్న ఆశతో చివరి వరకు ప్రయత్నించారు.టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌కు చేయిచ్చి... కారెక్కేశారు. అంతకుముందు నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేత, మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో కారెక్కేశారు. భారీగా అనుచరులతో వచ్చి, గులాబీ కండువా కప్పేసుకున్నారు. చేస్తున్నారు. అలాగే, ఎల్లారెడ్డికి చెందిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు కమలాన్ని వీడి, కారెక్కేశారు. టీడీపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేసిన ఆయన నాలుగేళ్ల కిందట బీజేపీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌ ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండారి లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. పొత్తులో భాగంగా ఉప్పల్‌ టికెట్‌ను టీడీపీ నేత వీరేందర్‌ గౌడ్‌కు కేటాయిస్తున్నందుకు నిరసనగా హస్తం పార్టీని వీడి కేసీఆర్‌ పక్షాన చేరారు.

కాంగ్రెస్‌, టీడీపీలోకి వలసలు కొనసాగాయి. కారు దిగి హస్తాన్ని అందుకోవాలని కొందరు అసంతృప్త నేతలు గాంధీభవన్‌ వైపు చూశారు. కొందరు రాహుల్‌ సమక్షంలో, మరికొందరు గులాంనబీ ఆజాద్‌ సమక్షంలో, హస్తాన్ని అందుకున్నారు. వరంగల్‌ తూర్పు టికెట్‌ దక్కకపోవడంతో కొండా సురేఖ దంపతులు కారు దిగి, తిరిగి హస్తంతో హ్యాండు కలిపి... టికెట్‌ సాధించుకున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు డీఎస్‌, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్‌లో చేరి... నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ దక్కించుకున్నారు. ఖానాపూర్‌ టికెట్‌‌ కోసం మాజీ ఎంపీ, టీఆర్ఎస్‌ నేత రమేశ్‌ రాథోడ్‌ చాలా ట్రై చేశారు. కానీ కారులో సీటు దక్కలేదు. అందుకే చేయి అందుకోవడం మేలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories