టీజేఎస్‌ అభ్యర్థులు వీరే!!

Submitted by arun on Tue, 11/13/2018 - 13:25

తెలంగాణ జన సమితి అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ కేటాయించిన 8 సీట్లలో ఐదింటికి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. జనగామ పోటీకి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమవుతుండగా..
మెదక్ సీటు జనార్ధన్ రెడ్డికి. దుబ్బాక టిక్కెట్ రాజ్ కుమార్‌కు సిద్దిపేట స్థానం భవానీ రెడ్డికి , మల్కాజ్ గిరి సీటును కపిలవాయి దిలీప్ కుమార్‌కు కేటాయించినట్లు సమాచారం. అయితే వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ అభ్యర్థుల ఎంపిక పోసం ఇంకా చర్చలు సాగుతున్నాయి. అయితే ముందుగా ఐదు స్థానాల అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. అటు జనగామ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కోదండరాం..అక్కడ ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేసుకోవడడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

English Title
Telangana Jana Samithi MLA Candidates List

MORE FROM AUTHOR

RELATED ARTICLES