ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం...సీఎంవో స్మితాసబర్వాల్‌పైనా గుర్రుగా ఉన్న...

ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం...సీఎంవో స్మితాసబర్వాల్‌పైనా గుర్రుగా ఉన్న...
x
Highlights

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ తన పరిపాలనా సౌలభ్యం కోసం భారీ మార్పులు...

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ తన పరిపాలనా సౌలభ్యం కోసం భారీ మార్పులు చేస్తున్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లకూ, టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు మధ్య సమన్వయం లోపం, వివాదాలు తెలెత్తుతుండటంతో రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో పాలనపై మరింత పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ అధికార యంత్రాంగం తమ గుప్పిట్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ నేతలతో సఖ్యతగా వ్యవహరించని అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

చాలా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో స్థానిక నేతలకు వివాదాలు తలెత్తాయి. పెద్దపల్లిలో కలెక్టర్ సర్పరాజ్‌తో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేనతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి, మహబూబాబాద్‌లో కలెక్టర్‌ ప్రీతిమీనా, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఏర్పడిన వివాదాలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశాయి. ఆ తర్వాత ఆ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేసినా మరికొన్నిచోట్ల కూడా ఎమ్మెల్యేలు, అధికారులకు మధ్య వివాదాలు తలెత్తాయి.

మరోవైపు సీఎంవోగా ఉన్న స్మితాసబర్వాల్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గుర్రుగా ఉన్నారు. సీఎం ఇచ్చిన హామీలను సైతం పక్కనబెట్టి అనేక విషయాల్లో కొర్రీలు పెడుతూ ఫైళ్లను పక్కన పడేస్తున్నారు. ఫోన్లు చేసినా సరిగ్గా స్పందించడం లేదని మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల నాటికి బ్యూరోక్రాట్‌ ప్రక్షాళన అవసరమని భావిస్తుండటంతో సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకూ బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఏ అధికారితో ఏ పని చేయించుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్న నేతలు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను జేసీలుగా నియమించుకుందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, 11 జిల్లాల్లో పూర్తిగా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories