మెదక్ జిల్లాలో యువతలో పెరిగిన రాజకీయ చైతన్యం

మెదక్ జిల్లాలో యువతలో పెరిగిన రాజకీయ చైతన్యం
x
Highlights

యువకుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతోంది. పోటీకి మేము సై అంటున్నారు. ప్రజాసేవ చేస్తామంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగేందుకు స్థానిక ఎన్నికలను...

యువకుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతోంది. పోటీకి మేము సై అంటున్నారు. ప్రజాసేవ చేస్తామంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగేందుకు స్థానిక ఎన్నికలను తొలిమెట్టుగా భావిస్తున్నారు. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో యువత బరిలోకి దిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో యువకులు పోటీ పడుతున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రజాసేవకు మేము సైతం అంటూ అంటున్నారు.

గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా యువకులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. సొంత ఊరి బాగు కోసం కొందరు ఉద్యోగులు కూడా వదిలేసి వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువతలో అధికంగా డిగ్రీ నుంచి పీజీ దాకా చదువుకున్నవారు ఉన్నారు. యువ ఉత్సాహం నేపథ్యంలో అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. టీఆర్ఎస్ తరపున అధిక మంది పోటీ చేస్తున్నారు. ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజాసేవకు పాటుబడతామని చెబుతున్నారు. యువకుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతుండడంపై రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories