కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బ

కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బ
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు గట్టి షాక్‌నిచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌ అగ్రనేతలుగా పేరొందిన పలువురు ఈసారి ఎన్నికల్లో...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు గట్టి షాక్‌నిచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌ అగ్రనేతలుగా పేరొందిన పలువురు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ ముఖ్యనేతలైన జానారెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, రేవంత్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెరాస అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. నాగార్జున సాగర్‌లో నోముల నర్సింహయ్య చేతిలో ప్రతిపక్ష నేత జానారెడ్డి పరాజయం చవిచూశారు. గద్వాలలో తెరాస అభ్యర్థి చేతిలో డీకే అరుణ, వనపర్తిలో నిరంజన్‌ రెడ్డి చేతిలో చిన్నారెడ్డి, కామారెడ్డిలో గంప గోవర్ధన్‌ చేతిలో షబ్బీర్‌ అలీ, టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్లో సాయన్న చేతిలో సర్వే సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ముఖ్యనేతలతో పాటు చాలా చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పరాజయం బాటలో ఉండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు డీలా పడిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories