ప్రజలను ఆకట్టుకునే హామీలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

ప్రజలను ఆకట్టుకునే హామీలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
x
Highlights

తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆకర్షించే హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ,...

తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆకర్షించే హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి లాంటి హామీలను ప్రకటించిన కాంగ్రెస్ గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. 35 అంశాలతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ నెల 23న జడ్చర్ల సభలో సోనియా చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

ప్రజాకూటమితో తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్ జనాకర్షక మేనిఫెస్టోను రూపొందించింది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పనతో పాటు మహిళల సంక్షేమం, గిరిజన, మైనార్టీ సంక్షేమం,వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసింది. ఆదివాసి కార్పొరేషన్ ఏర్పాటు, ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజ్వేషన్ల్ కల్పిస్తామని మేనిఫెస్టోలో రూపొందించారు. అదే విధంగా మైనార్టీల కోసం సబ్ ప్లాన్ ఏర్పాటు, వర్క్స్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కల్పిస్తూ ఉర్ధూను సెకండ్ లాంగ్వేజ్ గా అమలు చేస్తామని ప్రకటించింది.

మహిళా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణం, లక్షరూపాయల గ్రాంట్, సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. అదే విధంగా 300 కోట్లతో అడ్వకేట్స్ సంక్షేమ నిధి, 200 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు పారిశ్రామిక రంగంలో వంద శాతం పెట్టుబడులకు రాయితీ, కొత్త పరిశ్రమలకు 50 వేల ఎకరాలకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించింది. సమ్మక్క, సారక్క జాతర జాతీయ గిరిజన పండుగగా అమలు చేస్తామని ప్రకటించారు.

ఇక ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం, కొత్త పీఆర్సీ అమలు రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితి 60 ఏళ్లకు పొడగిస్తామని, ఆంధ్రాలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గల్ఫ్ కార్మికులు, ఎన్నారై సంక్షేమానికి వంద రోజుల సమగ్ర ఎన్నారై పాలసీ, 500 కోట్లతో సంక్షేమ నిధి రూపకల్పన చేస్తామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయితీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ 73, 74 అధికరణ ద్వారా స్థానిక సంస్థలకే అధికారాలు కల్పిస్తామని మురికి వాడల కోసం స్లమ్ డెవలప్ మెంట్ అథారిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ మెరుగు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories