పాదయాత్ర ఉత్కంఠ..త‌ల‌లు ప‌ట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

Submitted by arun on Thu, 02/22/2018 - 16:49
congress leaders

తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర ల ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతి కోసం ఎదురుచూసిన నేతలకు అధిష్టానం తీసుకున్న కొత్త నిర్ణయం విస్మయానికి గురిచేసింది. దీంతో ఎవరు పాదయాత్ర చేయాలో అర్థం కాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

పాదయాత్రలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ లో పోటీపడిన నలుగురిలో ఎవరికో ఒకరికి అధిష్టానం అవకాశం ఇస్తుందని భావిస్తే ఒకేసారి ముగ్గురు నేతలకు పాదయాత్రలు చేసుకోమని అనుమతి ఇవ్వడంతో నేతలు విస్తుపోతున్నారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీడీపీ నుంచి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో పాదయాత్రలు చేయడానికి ఎవరికి వాళ్లు అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే కోమటిరెడ్డిని పక్కనపెట్టిన అధిష్టానం మిగతా ముగ్గురుకీపాదయాత్రలు చేసుకోడానికి అనుమతిచ్చి ఆశ్చర్యపరిచింది. ముగ్గురుకీ అనుమతిస్తే ఎలా పాదయాత్రలు చేయాలని అధిష్టానం నిర్ణయంపై నేతలు మండిపడుతున్నారు.

దీనికి తోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా పాదయాత్రలు గురించి తనకేమీ తెలయదని చెప్పడంతో ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక మౌనంగా ఉండిపోతున్నారు. అయితే త్వరలో ఎవరికో ఒక్కరికే పాదయాత్రలు చేసే అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. 

English Title
telangana congress leaders padayatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES